ఉదకశాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక
ప్రక్రియ. మంత్ర జలాలతో చేసే శాంతి కాబట్టి దీన్ని ఉదకశాంతి అంటారు. దీన్ని ఉపనయనం, వివాహం,
స్నాతకం మున్నగు సంస్కారలోను,
షష్టిపూర్తి, సహస్రచంద్ర
దర్శనోత్సవం, ఇంకా పీడాఉత్పాత
ఉపశమనానికి, ఆయుష్షు, అరోగ్యం,
ఐశ్వర్యం కోరుకునే వారు ఆచరించాలని శ్రీ బోధాయన మహర్షి
చెప్పారు. నాలుగు దిక్కుల్లో ఉదకశాంతి జపం ఆచరించేందుకు నలుగురు స్వాముల్ని
అహ్వానించి, శుబ్రపరచిన స్థలంలో
ముగ్గువేసి, స్థండిలాన్ని ఏర్పాటు
చేస్తారు పురోహితులు. స్థండిలం అంటే పూర్ణకుంభాన్ని ఉంచడానికి నూతన వస్త్రంపై
వడ్లు,నువ్వులు, బియ్యం పోసి ఏర్పాటు చేసిన వేదిక. ముందు
విశ్వక్సేనుడు లేదా వినాయక పూజ తరువాత స్థండిలంలపై పూర్ణకలశాన్ని ఏర్పాటు చేసి, నాలుగు వేదాల్లోని వివిధ మంత్రాలు, ప్రక్రియలతో ఉదకశాంతిని పూర్తిచేస్తారు. ఆ
మంత్ర జలాన్ని తీర్ధంగా ఇస్తారు. అందరిపైనా సంప్రొక్షించి అశీర్వదిస్తారు.
No comments:
Post a Comment