Monday 24 March 2014

Ramayanam

రామాయణ గాధ
రామాయణాన్మి వాల్మీకి మహర్షి వ్రాసారన్నది జగద్విదితం. ఆ అవకాశం ఆయనకి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు ఆయనకు ?  సాక్షాత్ శ్రీరాముడే అని అంటారు. రావణ సంహారంతో రామావతారానికి ముగింపు వచ్చింది. ఇక రాముడెందుకుండాలి? దేవతలు బ్రహ్మ వద్దకు పోగా బ్రహ్మ రాములవారిని కలిసారు. ధర్మ సంభందమైతే వశిష్ట మహర్షి, పరిపాలనా సంబంధించినదైతే సుమంత్రులవారిని సంప్రదిస్తారు. కాని బ్రహ్మ రాములవారిని ఏకాంతంగా కలిసారంటారు. ఈ సంసార జీవితంలో కొట్టూకుంటూ, జనన-మరణ ఇతి బాధతోనున్న వారికి దారి కావాలి కదా! తన కధ లోక ప్రసిద్ధమవ్వాలని రాములవారికి అనిపించింది. అంతే, ఈ విషయం బ్రహ్మకు నివేదించబడింది. ఈ సంసార ఇతి బాధలగురించి అందరికీ తెలుసు. దాని నరకయాతనా తెలుసు, తెలియనిదల్లా ఎలా బయటపడటం. ఈ త్రిగుణాత్మక ప్రకృతి, దానికి తోడ్పడేదే! అటువంటి వారికి ఈ రామాయణగాధ కావాలి. ఎవరైతే ఈ గాధ వింటారో, చదువుతారో వారికి ఈ సంసార సముద్రంలో ఎలా ఈదాలో, ఒడ్డునకు ఎలా చేరాలో దీని ద్వారానే తెలుస్తుంది. మరి ఎవరు ఈ గాధను వ్రాస్తారు? బ్రహ్మకు వాల్మీకి గురించి చెప్పబడింది. నారదమునినుంచి ఆత్మప్రభోదం పొందిన వాల్మీకియే దానికి తగిన వ్యక్తి అని నిర్దారించిన పిదప, మహర్షి చేత ఈ గాధ వ్రాయించడానికి పరిస్తితులు కల్పించబడింది.
          మనిషియొక్క వంద ఏండ్ల ఆయుస్సులో సగం నిద్రలోనే గడుస్తున్నది. మరి దినచర్య, ఆరోగ్యం ఇతరత్రలు చేసిన తరువాత మిగిలింది ఏది? ఏ సమయంలో భగవద్యానానికి పూనుకోవడతాడు? మరి దీనినుంది మోక్షమెలా? ఇట్లా పుడుతూ, కర్మలనుభవిస్తూ, వృద్దప్యంలో రోగంతో మరణించడం, కర్మనుసారం మరల జన్మించడమేనా? ఇది ఒక విషపూరితమైన వృక్షం.
          రామాయణం విని, చదివిన వారికి ఇందునుండి ఎలా బయట పడాలో తెలుస్తుంది. సంసారాన్ని అమృతమయంగా చేసుకొని, భగవన్నామముతో, ఉన్నదాంట్లో ఎంతో కొంత ఇతరులకిస్తూ, ఆనందిస్తూ ఈదడం ఎలా అని ఈ రామాయణ గాధ నుంచే తెలుస్తుంది తప్ప విషయవస్తువుల మీదపడి, దానిని పొంది, పొందలేకపోతే కోపంతో...., క్రోదం పెంచుకొని, మరల మరల జీవాత్మకు విశ్రాంతిలేక చేయటంకాదు.
          వినుడు..వినుడు రామాయణ గాధ.. వినుడే మన గాధ!

Friday 14 March 2014

Shatamanam Bhavati....


ఆయుర్దాయం
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం అని చెప్పబడించి. నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. గుడ్ మార్నింగ్ అని చెప్పడం, గుడ్ నైట్ చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.
          బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.
          ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
         పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||
అని చెప్పబడింది. అంటే ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. ఏది నిజం మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.
          లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.
(ఈ వ్యాసం అరణ్యస్పందన నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా|| అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)

Thursday 6 March 2014

Dampathi



పరమాద్భుత కళాకారుడైన భగవంతుడి సృజన పౌరుషానికి సజీవ సాక్ష్యమే ఈ సృష్టి! ఇది ఆయన గీసినబొమ్మ. ఆయన చేసిన రచన. ఆయన భావుక మహా సౌందర్య శోభ, ప్రకృతిలోని ప్రతి అణువునా ప్రతిఫలిస్తుంది, సమ్మొహనపరుస్తుంది. దాని శ్రేష్ఠతకు సౌందర్యమే ప్రమాణం! భగవంతుడి సృజనలో పరమ రహస్యం దాగి ఉంది. స్త్రీ పురుష ప్రకృతుల మధ్య ఆరాధన, సమర్పణలతో శృంగార సంఘర్షణలో సృష్టి యావత్తూ ప్రభవిస్తుంది. నాగరికమైన కట్టుబాటు ఫలితంగా వివాహ వ్యవస్థ నిర్మాణమైంది. వేదం నిర్దేశించిన ఆ వ్యవస్థ మానవజాతి శారీరక అవసరాలను తీర్చింది. మానసిక బంధాలను కూర్చింది. ఆనురాగ మాధుర్యాన్ని జతపర్చి, ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చింది. భారతీయ వివాహ వ్యవస్థ వాస్తవానికి స్త్రీ పురుష సర్వేంద్రియ సంతర్పణకు దోహదకారి. ఆత్మీయ శిఖరాయమాన పరిపూర్ణ దాంపత్య అపూర్వ అద్వైత అనుభూతికి సహాయకారి!
అద్భుతం అనే మాటను ఒకే అక్షరంలో చెబితే అది స్త్రీ. ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతంచేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్ళి. మూడు ముళ్ళతో మొదలయ్యే నూరేళ్ల బంధాన్ని మూడే అక్షరాల్లో పలికితే - అది దాంపత్యం. దాంపత్య జీవనంలో స్త్రి అనే వీణను అమోఘంగా శ్రుతి చేయగల గొప్ప విద్వాంసుడి నాలుగు అక్షరాల పేరు - పురుషుడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడే ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట - భార్యాభర్తలు. ఆడ, మగ - భార్యాభర్తలయ్యే క్రమానికి ప్రామాణికతను ఆపాదించే ఆరు అక్షరాల తంతు పేరు వైదిక ప్రక్రియ. వేద ప్రమాణాన్ని ఆచరించే భార్యాభర్తలు తమ తలకెత్తుకునే ఏడక్షరాల గొప్ప బాధ్యత - గృహస్థాశ్రమ ధర్మం. ఇదే సప్తపది..! ఏడు అంచెల జీవన మాగంల్య మహాసూత్రం.
         ఏడు అడుగులతో పురుషుడి జీవితంలోకి ప్రవేశించే స్త్రీ- అప్పటిదాకా తన వెంట వచ్చిన ఇంటి పేరును, గోత్రాన్ని, ప్రాణమిత్రుల్ని, అన్నదమ్ముల్ని- ఆఖరికి తన తల్లిదండ్రులను, వారి గారాబాన్ని.. అన్నీ విడిచిపెట్టి వస్తుంది. ఇకపై తన భర్త నుంచి - ఆ వదులుకున్నవన్నీ పొందగలనన్న నమ్మకంతో వస్తుంది. అందుకే పెళ్ళిచూపులలో భావం కలగాలని వేదం అంటుంది. ఈమె నా కోసం పుట్టింది అనే భావం పురుషుడికి కలగాలి. ఇతడు నాకోసం ఉన్నాడు అన్న భరోసా స్త్రీకి కలగాలి. సప్తపది మంత్రాల్లో పురుషుడి నోట పలికించే వాగ్ధానం అదే ! ఏడడుగులు నాతో నడిచి మిత్రురాలివి కా! ఒకరికొకరం చక్కని స్నేహితులమై జీవిత పర్యంతం కలిసి నడుద్దాం- అని పురుషుడు పలుకుతాడు. నిజానికి సుముహుర్తం అంటే - బెల్లం జీలకర్ర తంతు కాదు, తొలి చూపులో పురుషుడి కంటి నుంచి స్త్రీకి సర్వభద్రంకరమైన ఆ భరోసా ప్రసారమయ్యే క్షణాన్నే శుభముహుర్తం అనాలి. తెర తొలగించాక జరిగే ఈ చూపుల కలయికనే చక్షు సంయోగం అంటారు. ఆ సమయంలో మంచి మనసుతో చేసిన ఆ వాగ్దానాన్ని పురుషుడు జీవితాంతం నిలబెట్టుకోవాలి. భర్త సమక్షంలో ఉండే సమయంలో స్త్రీకి తండ్రి గుర్తొచ్చినా, బెంగ కలగకూడదు.. తల్లి తండ్రి లేదన్న లోటు తెలియకూడదు. తోబుట్టువులు, స్నేహితులు ఎవరి గురించీ దిగులు పుట్టకూడదు. వారినుంచి గతంలో ఆమె ఎన్నెన్ని రకాల ఆప్యాయతలను పొందిందో, అన్ని రకాలనూ ఆమె తన భర్తనుంచి అందుకోగలగాలి. పురుషుడు స్త్రీకి అన్ని కోణాల్లోంచీ బంధువు కావాలి. స్పర్శలో, మాటలో, చేతలో, చూపులో.. అంతెందుకు - తన పురుషుడి స్మరణమాత్రం చేత స్త్రీ మనసు రాగరంజితం కావాలి. పురుషుడు స్త్రీకి సఖుడు కావాలంది వేదం. సఖ్యం అనే మాట పెళ్ళి మంత్రాల్లో విశేషంగా ధ్వనిస్తుంది. పైన చెప్పిన ప్రతి చేష్టలోనూ స్త్రీకి సఖ్యత అనేది అనుభవంలోకి రావాలి. అతడి లాలనలో ఆమె అనుక్షణం పరవశం చెందుతూ ఉండాలి. ఆమె గుండెలో అది ఒకానొక ఆకుపచ్చని పులకరింతగా స్థిరపడి.. అతడు ఎక్కడున్నా చెంతనే, తనకు తోడుగా ఉన్నాడన్న భావం కలిగిస్తూ- అనుభూతి పరిమళాన్ని పంచుతూ ఉండాలి. దీన్నే సర్వేంద్రియ సంతర్పణం అంటారు. స్త్రీలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుందది. అటువంటి పురుషుడికి స్త్రీ తన సర్వస్వాన్నీ ఇష్టంగా ధారపోస్తుంది. ఆమె అలా చేయాలంటే, పురుషుడు రసజ్ఞ మనోజ్ఞ ప్రతిభామూర్తి అయి ఉండాలి. ఈ సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు అని మీరబాయి అనడంలో అంతరార్థం అదే ! భార్య పస్తులుంటే భర్తకు అన్నం సయించని స్థితి కలగాలి. ఆమెకు కష్టమొస్తే తనకు నొప్పి తెలియాలి. ఇంటిదగ్గర ఆమె ఒంటరిగా ఉందని ఏదో తెలియని దిగులు వంటిది మనసుకు తోచాలి. త్వరగా ఇల్లుచేరాలన్న ఆరాటం కలగాలి. తహతహ పుట్టాలి.
         ఇవన్నీ స్త్రీకి వర్తిస్తాయి.. దాంపత్య బంధంలోని చమత్కారం అదే ! స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు. ఇల్లాలికి గౌరవవాచకం తల్లి. ఆ రెండుహోదాలనూ స్త్రీకి కట్తబెట్టేది వివాహ బంధమే! స్త్రీకి జీవితంలో సర్వశ్రేష్టమైన ఆనందం అనుభవమయ్యేది- అమ్మ అయినప్పుడే. స్త్రీ జన్మకు తల్లికావడమే ధన్యత. భర్తకు తనను తాను సంపూర్ణంగా సమర్పణం చేసుకుని స్త్రీ తరించాలి. భార్యాభర్తలను వేదం దంపతులు అనదు - దంపతి అంటుంది. అలాంటి అధ్వైత స్థితిలో అతడు పూవయితే,  ఆమె పరిమళం. అతడు చంద్రుడైతే, ఆమె వెన్నెల. అతడు దీపం, ఆమె వెలుగు, అతడు వాక్కు అయితే ఆమె దాని అర్థం. శివపార్వతుల బంధాన్ని కాళిదాసు అలాగే కీర్తించాడు. ఆలుమగలు ఆడదిగా మగాడిగా మిగిలిపోకుండా దంపతిగా మారినప్పుడే  సమభాగం, సమభోగం, సమయోగం అన్న భావన సార్థకం అవుతుంది. ఇదే భారతీయ దాంపత్య రసయోగంలోని సారాంశం. స్త్రీ పురుషులు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన పాఠ్యాంశం!.

Sunday 2 March 2014

The Three types of Sins & Virtues



Punya and Paapa are of three types based on whether the Karma is performed mentally, verbally or bodily. Consequently, the results of the sins too are experienced through the agencies of the mind, the organ of speech and the body respectively.
What constitutes mental sin has been defined as follows:

परद्रव्येष्वाभिध्यानं मनसानिष्टचिन्तनम् ।
वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥

Mental sins are of three kinds: The arising of the thought that another’s possessions must be usurped, the thought that another must be harmed, and harbouring of thoughts that are contrary to the Shastras. For instance, the Shastras state the existence of Ishwara who creates, sustains and dissolves the Cosmos, and also ensures that everyone gets the fruits of their own Karma. There are some who deny the existence of Ishwara; this denial is a mental sin. There are others who deny rebirth. This too is a mental sin. When people commit such mental sins, they lose peace of mind in their following births. It is a matter of experience that one first thinks, expresses the thought and then puts the thought into action. Even if the thought has not fructified into action, a mental thought as mentioned above still constitutes a sin. Similarly, when one commits a verbal sin, one has to experience those results as well through the organ of speech.

The Shastras classify the verbal sins as follows:

पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः ।
असम्बद्धप्रलापश्च वाङ्ममयं स्याच्चतुर्विधम् ॥

Hurting others by speaking harshly is the first verbal sin. Telling lies is the second. Speaking unnecessarily without paying attention to the context of where we are(for instance gossiping while sitting in a temple). When people indulge in these sins, they end up being dumb, or develop a stammer, or speak incoherently.

अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः ।
परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ॥

Stealing, causing physical harm, and lusting after women constitute bodily sin. The reactions to these sins have to be experienced by the body. It is important for everyone to refrain from these 10 sins in this lifetime, thus avoiding experiencing the fruits of these sins in future. The Dharma Shastras advise us thus for our welfare. We have to realize this and adhere to these instructions.
Just as sins fall into three categories and are enumerated under each category, the good deeds or Punya also fall into these categories and are enumerated as the exact antithetical act of the sins. For instance, the thought of usurping another’s wealth is a mental sin. The corresponding Punya Karma constitutes the thought of engaging in charity – the thought of giving away one’s wealth for the welfare of the other.The thought of harming other is a mental sin. The corresponding Punya is to have the thought of bringing about the welfare of another. Thoughts harboured in opposition to the Shastras  constitute mental sin, whereas the corresponding Punya is to live with thoughts that conform with the Shastras.
We see even today that some children have the tendency to engage in worship. If the child’s father sits in worship, the child would do the same. If the father applies Bhasma (vibhuti), the child too follows. The child is not instructed to do so. This inclination comes to the child naturally. Such is the Samskara of the child, that it develops a devotion to God. Such Punyas result in peace of mind in the future lifetimes. Some people say, “I have no worries. I am peaceful happy and contented”. This is the result of the Punya performed by the mind in the past. Speaking sweetly, adherence to the truth, refraining, and speaking in accordance to the context and time constitute verbal Punya. Such people are blessed with a great power of speech. Engaging in charity, helping others and looking upon every woman as one’s mother constitute bodily Punya.
In future lives, they are blessed with good physical health as a result.

*Taken from Internet . The article is by His Holyness  Jagadguru Sri Bharati Tirtha Mahaswamiji