రామాయణ గాధ
రామాయణాన్మి
వాల్మీకి మహర్షి వ్రాసారన్నది జగద్విదితం. ఆ అవకాశం ఆయనకి ఎలా వచ్చింది? ఎవరు
చెప్పారు ఆయనకు ? సాక్షాత్
శ్రీరాముడే అని అంటారు. రావణ సంహారంతో రామావతారానికి ముగింపు వచ్చింది. ఇక
రాముడెందుకుండాలి? దేవతలు బ్రహ్మ వద్దకు పోగా బ్రహ్మ రాములవారిని
కలిసారు. ధర్మ సంభందమైతే వశిష్ట మహర్షి,
పరిపాలనా సంబంధించినదైతే సుమంత్రులవారిని
సంప్రదిస్తారు. కాని బ్రహ్మ రాములవారిని ఏకాంతంగా కలిసారంటారు. ఈ సంసార జీవితంలో
కొట్టూకుంటూ, జనన-మరణ ఇతి బాధతోనున్న వారికి దారి కావాలి కదా! తన కధ లోక
ప్రసిద్ధమవ్వాలని రాములవారికి అనిపించింది. అంతే, ఈ విషయం
బ్రహ్మకు నివేదించబడింది. ఈ సంసార ఇతి బాధలగురించి అందరికీ తెలుసు. దాని నరకయాతనా
తెలుసు, తెలియనిదల్లా ఎలా బయటపడటం. ఈ త్రిగుణాత్మక ప్రకృతి, దానికి
తోడ్పడేదే! అటువంటి వారికి ఈ రామాయణగాధ కావాలి. ఎవరైతే ఈ గాధ వింటారో, చదువుతారో
వారికి ఈ సంసార సముద్రంలో ఎలా ఈదాలో,
ఒడ్డునకు ఎలా చేరాలో దీని ద్వారానే
తెలుస్తుంది. మరి ఎవరు ఈ గాధను వ్రాస్తారు? బ్రహ్మకు
వాల్మీకి గురించి చెప్పబడింది. నారదమునినుంచి ఆత్మప్రభోదం పొందిన వాల్మీకియే
దానికి తగిన వ్యక్తి అని నిర్దారించిన పిదప, మహర్షి
చేత ఈ గాధ వ్రాయించడానికి పరిస్తితులు కల్పించబడింది.
మనిషియొక్క వంద ఏండ్ల ఆయుస్సులో సగం నిద్రలోనే గడుస్తున్నది.
మరి దినచర్య, ఆరోగ్యం ఇతరత్రలు చేసిన తరువాత మిగిలింది ఏది? ఏ సమయంలో
భగవద్యానానికి పూనుకోవడతాడు? మరి దీనినుంది మోక్షమెలా? ఇట్లా
పుడుతూ, కర్మలనుభవిస్తూ,
వృద్దప్యంలో రోగంతో మరణించడం, కర్మనుసారం
మరల జన్మించడమేనా? ఇది ఒక విషపూరితమైన వృక్షం.
రామాయణం విని, చదివిన వారికి ఇందునుండి ఎలా బయట పడాలో
తెలుస్తుంది. సంసారాన్ని అమృతమయంగా చేసుకొని, భగవన్నామముతో, ఉన్నదాంట్లో
ఎంతో కొంత ఇతరులకిస్తూ, ఆనందిస్తూ ఈదడం ఎలా అని ఈ రామాయణ గాధ నుంచే
తెలుస్తుంది తప్ప విషయవస్తువుల మీదపడి,
దానిని పొంది, పొందలేకపోతే
కోపంతో...., క్రోదం పెంచుకొని,
మరల మరల జీవాత్మకు విశ్రాంతిలేక చేయటంకాదు.
వినుడు..వినుడు రామాయణ గాధ.. వినుడే మన గాధ!
No comments:
Post a Comment