Sunday, 2 March 2014

Rushulu.....Raja Rushis & Brahma Rushis



ఋషులు మూడు రకాలుగా ఉంటారు. రాజులు ఋషులైతే రాజఋషులు అని అనబడతారు. అలాగనే  బ్రహ్మఋషులున్నారు.
          విశ్వామిత్రునికి బ్రహ్మఋషిగా పిలవబడాలని ఎంతో కోరిక ఉండేది. దానికొరకు ఆయన తపస్సు చేసారు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఋషి అని పిలిచాడు. దానితో సంతృప్తినొందక ఘోరతపస్సు చేస్తే, బ్రహ్మ ప్రత్యక్షమై రాజఋషి అని నామకరణం చేసారు. సంతృప్తి పొందని విశ్వామిత్రుడు మరింత ఘోర తపస్సునాచరించాడు. బ్రహ్మచే బ్రహ్మఋషి అని అనిపించుకోవాలనుకున్నారు.
          కాని బ్రహ్మదేవులు విశ్వామిత్రుని ఓర్పును పరిశీలించగోరి తరచుగా ప్రశ్నలు వేసాడు. దానితో విశ్వామిత్రులకు ఓర్పు నశించి, కోపోద్రికులై బ్రహ్మఋషి పట్టాన్ని పొందలేకపోయారు. విషయం అర్ధం చేసుకొని, విశ్వామిత్రులు తన కోప-తాపాలను తగ్గించుకొని ఘోర తపస్సుచేసి చివరకు బ్రహ్మఋషి అని అనిపించుకున్నారు! దీనితోనూ సంతృప్తిపొందక వశిష్ఠమునిచే బ్రహ్మఋషి అని పిలిపించుకోవాలని ఆరాటం పొందారు. ఎలాగైతేనేమి వశిష్ఠులవారు ఆయనని బ్రహ్మఋషి అని పిలువగా దానితో సంతృప్తి చెందారు.
          అందువలన, పట్టువిడువక తాను నమ్మిన దానిని పొందేవరకు ప్రయత్నిస్తే తప్ప అది దొరకదని తెలుస్తుంది. ఈ విధంగా బ్రహ్మఋషి అవటం వలననే ఆయనకు గాయత్రీమంత్రం ఉపదేశింపబడింది. ఋషులు కూడా వస్తువిషయాలకు లోబడతారని మనకందరికీ తెలుస్తున్నాది. విశ్వామిత్రులవారు స్త్రీవ్యామోహంలో పడి శకుంతలకు తండ్రి అయ్యారని మనకు తెలుసు. అందువలన మనమందరమూ ఎంతో జాగ్రతతో వ్యవహరించాలి. ఋషులే తప్పులుచేయగా మనమెంత?
          ఋషులకు తపోశక్తులున్నాయని మనకందరికీ తెలుసు. ఒకప్పుడు ఇద్దరు ఋషుల మధ్య ఎవరు గొప్పవారో అన్న విషయంపై పోటీ జరిగింది. తడిసిన మానుని అగ్నికి ఆహుతి చేయటమే పందెం. ఒక ఋషి మాను నుంచి, తన తపోశక్తితో, పొగవచ్చేలాచేసారు, రెండో ఋషి దానిని నిలువునా కాల్చి బూడిద చేస్తాడు. ఇది ఎందువలన సంభవించింది. తపో శక్తితో మాత్రమే!. తపస్సు అంటే ఏమిటి? పూజ్య గురుదేవ్ చెబుతారు...   
          ఈ ఋషుల పరంపర నుంచే మనకు ఈ నాడు వేదము, దానిని ఏ విధంగా ఆచరించాలి, అనుకరించాలి అనేవి తెలిసాయి. పతంజలి ఋషి ద్వార పాతంజల యోగసూత్రములు, వేదవ్యాసుల ద్వార భారతము, భగవద్గీత, వాల్మీకి ఋషి ద్వారా రామాయణము ను పొందాము. మనమందరమూ మూడు రకాల ఋణాలతో పుట్టామని పురాణం చెబుతున్నది. అందులో ఒక ఋణం ఋషిఋణం. దీనిని బట్టి మనము ఋషులకు ఎంత ఋణపడి ఉన్నామో తెలుస్తున్నది.... వారికి వారివారి జన్మదినమున పూజలు చేయటము, వారిచ్చిన వేదాంతమును ప్రతిరోజు స్వాధ్యాయనము చేయటము, దానిలోని సారాంశములను ఆవగతం చేసుకొని మన జీవితాన్ని సార్ధకత్వము చేసుకోవటం తోనే...

No comments:

Post a Comment